వినాయకుని జన్మ కధనం( పురాణాలలో గణేశుడు)
వినాయకుని పుట్టుక గూర్చి వివిధములుగా వర్ణిస్తున్నాయి.ఆ కధలను తెలుసు కోవడం వలన భక్తుల హృదయంలో గణేశుని లీలలు నాట్యమాడుతూ వినాయకుని ఫై మరింత భక్తి పెరుగుతుంది. అయితే వినాయక ఉత్పత్తి గురించి పురాణాలూ ఎమి చెబుతున్నాయి
పద్మ పురాణం
పద్మ పురాణంలో సృష్టి ఖండంలో గణేశ ఉత్పత్తి వివరించబడింది. పార్వతి కళ్యాణం జరిగిన తర్వాత పార్వతి పరమేశ్వరులు అత్యంత అనురాగంతో ప్రేమానందము లతో రమణీయమైన ఉద్యానవనాలతో విహరిస్తూ ఉండేవారు. ఒక నాడు పార్వతి దేవి తలంటు స్నానం చేయాలనుకొని వంటికి నలుగు పెట్టుకొంది.అట్లా నలుగు పెట్టగా వచ్చిన నలుగు పిండిని ముద్దగా చేసి యధాఫలంగా ఓకే బొమ్మలాగా చేసింది. అది ఒక పురుషాకృతి తలమాత్రం ఎనుగ తల లాగా వచ్చింది. అప్పుడు పార్వతి ఆ బొమ్మని నీళ్ళలో(గంగలో) పడ వేసింది. అలా ఈశ్వరార్ధంగియైన పార్వతి పుణ్య శరీరానికి పెట్ట బడిన నలుగు పిండి బొమ్మ పవిత్ర గంగ జలంలో పడడంతో ఆ బొమ్మకి ప్రాణం వచ్చింది. పసిపిల్లవాడు అయ్యాడు. పార్వతి దేహం నుండి పుట్టి,గంగలో ప్రాణం పోసుకొన్న ఆ బాలుడిని వారి పుత్రుడుగును,గంగేయుడని దేవతలు పరిగణించారు. స్తుతించారు. తర్వాత ఆ బాలుడు పెరిగిన తర్వాత ఆ బాలుని వారి గణములకు అధిపతి ని చేసి గణాధిపతి/గణపతి అని పెర్ర్లు వచ్చుటకు కారకులు అయ్యారు. దేవ,రాక్షస మానవ జాతులందరి చేత పూజింప బడ్డాడు. పూజింపబడుతున్నాడు
లింగ పురాణం
లింగ పురాణం పుర్వద్ధములో దేవతలు ఒక చోట చేరి సంభాషించు కొనుచున్న ప్రస్తావన వచ్చింది.రాక్షసులు,సృష్టి కర్త బ్రహ్మను గూర్చియో, భక్త సులభుడైన శివుని గూర్చి తపస్సు చేయడం, వారు రాక్షసులు కోరిన కోరికలు తీర్చటం మరియు వరములు ఇవ్వడం మూలంగానే రాక్షసులు తమ కంటే బలవంతులు అయిన తమను బాధపెట్టు చున్నారని గుర్తించారు. అపుడు దేవతలు శివుని ప్రాద్దించి తామును రాక్షసుల వాలే బలవంతులై వారి భాదల నుండి విముక్తి పొందాలని నిర్ణయిoచుకొని దేవతలు అందరు శివుని ప్రాద్దించారు. శివుడు వారి ప్రాద్దనలకు సంతసించి వరమును కోరుకోమన్నాడు
అప్పడు దేవతలు అందరు తరుపున బృహస్పతి(గురుడు) ` ఓ పరమేశ్వరా` దేవ శత్రువులైన రాక్షసులకు వారు నిన్ను పూజించిన అంతటే నీవు వారికీ కావలసిన వరములు ఇచ్చు చున్నావు. నీవు ఇచ్చిన వరముల గర్వం చే వారు మమ్ములను పలు విధములుగా హింసించుచున్నారు. కావున మేము వారి కార్యములను విఘ్నం చేయగలుగునట్లు వరమిమ్ము అని అడిగెను. శివుడు తధాస్తు త్వరలో వారి కార్యములకు విఘ్నములను చేయగలవాడు ఉద్భవించెను అని వరము ఇచ్చెను
కొంత కాలమునకు ఈశ్వరపత్ని అగు పార్వతికి గణేశుడు కలిగాడు.పరమ తేజస్వియైన ఆ బాలకుని తల ఎనుగుదై ఉండటం చేత గజనుడు/గజముఖుడు అని పెర్ర్లు కలిగాయి. ఈశ్వరుడు అతనికి సమయానుకూలంగా జాతక, ఉపనయనాది కర్మలనాచరించెను.దేవతలందరూ.ఆ అవతార పురషుడైన గజానునికి నమస్కరించారు
శివుడు ఆ బాలకుని విగ్ననయకునిగా ప్రకటించి అతనితో `కుమారా ! నేటి నుండి నీవు విగ్నగణములకు నాయకుడవి.ఇకఫై రాక్షస సంహారం చేయవలసి యుండును. దక్షిణలు లేకుండా కర్మిస్థలను నీవు కాపాడవలయును. ఈ ప్రపంచంలో అన్యాయముగా అధ్యయనం,అధ్యాపనం,వాఖ్యములను చేయువారి ప్రాణములను హరించాలి. ముల్లోక వాసులు చేయు పూజాది సర్వ కార్యములందును ముందుగా నిన్ను పూజించి అట్లు నిన్ను ముందుగా పుజించకుండా చేయబడు వారి కార్యములను నీవు విఘన్న్ములు కల్పించాలి. బ్రహ్మ,విష్ణువు, నేను ఇతర దేవతా ప్రముఖుల కొరకు చేయబడు యజ్ఞాది పూజ కార్యములందైన ముందుగా నిన్ను పుజించకుండా పూజలు చేసినా వారికీ మానుండి ఎట్టి శుభములను వారు పొందలేరు. కావున నేటి నుండి నీవు సర్వప్రధమ పుజ్జ్యుడువి.బ్రాహ్మణా క్షత్రియ,వైశ్య శుద్రాదిచతుర్వర్వములవారు
నిన్ను ధూప ధిప గంధ పుష్పాలతో అర్పించినచొ వారి కార్యములకు శుభములు ఇచ్చి వారిని రక్షింపుము. నిన్ను పుజించకుండా చేయబడు యే కార్యములకైనను నీవు విఘన్న్లు కల్పించుము.నేటి నుండి నీవు విగ్ననాయకుడివి అని
చెప్పాడు. నాటి నుండి నినాయకుడు రాక్షసుల కార్యములను ఆటంకములు కల్పించుట మొదలు పెట్టాడు
శివ పురాణం
ఒకనాడు భవాని స్నానం చేస్తున్న సమయంలో హటాత్తుగా శివుడు లోపలికి వచ్చేశాడు.ఆ సంఘటనతో పార్వతి దేవి సిగ్గుపడి పోయి స్నానం మధ్యలో ఆపేసి లోపలకు పరిగెత్తింది. తన భర్త యోఅయినా అలా
అభ్యంతర మందిరంలోకి శివుడు రావడం ఆమెకు సిగ్గు కలగడం అనే పరిస్టితి ని తలచుకొని విషయాన్ని తన చేలికత్తెలైన జయ, విజయలతో ముచ్చటించింది.డానికి వారు `నిజమే దేవి`! నంది,బృంగి మొదలైన వారంతా శివ గణములు,వారు శివాజ్ఞకు బద్దులు.వారు మనకు కావలసిన విధంగా నడుచుకొనే పరిస్టితి ఉండక పోవచ్చు.కావున ఆ శివగణముల వలెనే మనకును కొందరు గణ సబ్యులు ఉండటం అవసరం.జగన్మతావు నీవు కావున నీవును ఒక గణంను ఏర్పాటు చేయుము. అని సలహా ఇచ్చారు.అది పార్వతికి నచ్చింది
పార్వతి దేవి ఒకనాడు అభ్యంగ స్నానం చేయదలచి శరీరమునకు నలుగు పెట్టుకొంది. వచ్చిన నలుగు పిండితో పురుషాకృతిలో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసింది. ఆ బాలుడిని ద్వారం వద్ద నుండమని,లోపలికి ఎవ్వరిని రానివద్దని చెప్పింది. ఆ బాలుడు సరేనని ద్వారపాలకుడిగా నిలిచాడు.అంతలో శివుడు వచ్చి అలవాటుగా గబ గబగా అంతఃపురంలోనికి వెళ్ళ బోయాడు.అప్పుడా బాలకుడు శివుని లోపలకు వెళ్ళనీయ కుండా అడ్డు కొని లోపలకు ఎవ్వరిని రానియవద్దని అమ్మ అజ్ఞా.! మేరు వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు.దానికి శివుడు క్రొత్త వాడివిలాగున్నావు !నేను మీ అమ్మ భర్తనే దారి వదులు అని అన్నాడు.దానికా బాలుడు`నీవు మా అమ్మకు భర్తవే కావచ్చు.కానీ నాకుయజమానివి కాదు గాధ.నీవు లోపలకు వెళ్ళడానికి వీలు లేదు.శివుడు ఆ బాలకుని జన్మ వృతాంతం తెలుసుకొన్నాడు.శక్తీ ఆశిర్వాదాయుతుడైన ఆ బాలుడు సామాన్యుడు కాడని తలచి అతడిని సౌమ్యంగా ఎలా వరించాలా అని యోచిస్తునాడు.కాని శివ గణములు శివుని ఆ బాలుడునిఎదిరించటం చూసి సహించలేక పోయారు.రుస రుసలాడారు.వారి ఆలోచనలను పసిగట్టి పరమేశ్వరుడు తనకు వినోదము, శివ గణములకు అనుభవం కలుగునని తలచి ఆ బాలుని ద్వారం వద్ద నుండి తొలగించమని శివ గణములకు అజ్ఞ ఇచ్చాడు
శివ గణములు ఆ బాలుని ద్వారం వద్ద నుండి తొలగి పొమ్మని తగవు పెట్టుకొన్నారు. యుద్దానికి దిగారు. ఆ బాలుడు వారిని తరిమి కొట్టాడు.ఇలా మూడు సార్లు జరిగింది. పరాజితులైన శివ గణములు
పోయి మొత్తము శివుని పరివారం నందరిని బాలునితో యుద్దానికి తీసుకువచ్చారు.బయట జరుగుతున్నా కలకలమును గూర్చి చెలికత్తెల ద్వార తెలిసికొని, భర్త ఫై ఎంత గౌరవాభిమానములు ఉన్న ,ఆ బాలుని ఫై శివ గణముల దూకుడు ను సహించ లేక పార్వతి తన చెలి కత్తెల ద్వార ఆ బాలుని ప్రోత్సహించింది.అమ్మ ఆజ్ఞ అయినందున పరిచారకుల ప్రోత్సాహానికి రెచ్చి పోయాడు.శివ గణములను చిత్తు చిత్తుగా కొడుతున్నాడు.శివ గణములు ఆ బాలుని దాటికాలేక ఎవరికీ వారు పరుగులు పెడుతున్నారు
శివుడు బాలునితో తన గణములు చేయు పోరాటాన్ని ఆనందంగా గమనిస్తూ ఉన్నాడు. ఈ యుద్ద విశేషం గూర్చి తెలిసి బ్రహ్మాది దేవతలందరూ వచ్చారు.యుద్దమును నివారించమని పరమేశ్వరుడుని కోరారు. `నాకు నేనుగా సంధిని కోరితే శివుడు భార్య విదేయుడనే అపఖ్యాతి వస్తుంది.కావున మేరె ఆమెతో (పార్వతి తో) సంప్రదించి ఈ యుద్దాన్ని ఆపు చేయిoచండి అన్నాడు. మహేశ్వర్రుడు.బ్రహ్మ ఆ యుద్ద ప్రాంతానికి వచ్చి బాబూ అంటూ ఆ బాలుడితో ఏదో చెప్పాబోయాడు.అతదు కుడా శివ గణంములలో ఒకడిని బావించి బ్రహ్మగారిని హింసించా పోయాడు ఆ బాలుడు. అతడి పరాక్రమాన్ని నిలువరించ లేని బ్రహ్మ తాను యుద్దానికి రాలేదని,మధ్య వర్తిగా వచ్చానని , తనను వదిలి వేయమని కోరి ఆపద తప్పించుకొన్నాడు
విష్ణువు,దేవసేనాదిపతి,ఇంద్రుడు, మొదలైన దేవ వీరులoతా ఆ బాలునితో యుద్దానికి దిగారు. కాని ఎవ్వరు ఆ బాలుని నివారించలేక పోయారు.హాహాకారాలు మిన్ను ముట్టాయి. అన్ని లోకాలు ఆశ్చర్యపోయాయి.దేవతలు అందరు శివుని శరణు కోరారు. అప్పుడు శివుడు మహాకాల స్వరూపమైన తన త్రిశులాన్ని ఆ బాలునిఫై ప్రయోగించాడు. దానితో ఆ బాలుని తల ఖండింప బడింది.ఆ పసివాడి మరణాన్ని పార్వతి సహించలేక పోయింది. శివుడే సరాసరి యుద్దానికి దిగినప్పుడు తానును యుద్దానికి దిగితే తప్పేముంది. అని బావించి రంగ ప్రవేశం చేసింది. ఆమె ఆవేశంతో చేసిన హుకరింపు నుండి కరాళి,కుబ్జక,ఖంజ, లంబ, శిర్షిక మొదలైన మహాశక్తులు ఎన్నో ఉద్భవించాయి. ఆశాక్తేయ గణాలు శివగణములను,దేవగణములను చీల్చి చెండాడు తున్నాయి.దేవతలకు ఏమి చేయాలో పాలు పోలేదు.నారది ముని బృందాలను ప్రాద్దించి అంబను శాంతింప జేసి యుద్దమును నివారించమని కోరారు
నారదాది మహర్షుల ప్రాద్ధనలకు మెచ్చిన ఆ జగన్మాత `నా కుమారుడైన ఆ బాలుని పునఃజివితున్ని చేస్తే నా శాక్తేయ గణాలను ఉపసంహరిస్తాను(వెనుకకు పులుస్తాను). అన్నది. ఆమె చెప్పినట్లు చేయడం ఆ పరమేశ్వరునికి కుడా తప్ప లేదు.`సరే ఉత్తర దిశగా వెళ్లి తొలిగా యే ప్రాణి కనిపిస్తే దాని తల తీసుకురండి అన్నాడు. ఈశ్వరుడు.ఈ లోపున ఆ బాలుని శరీరంకు స్నానం చేయించి పూజ ద్రవ్యలతో అలంకరించారు
తల కోసమై వెళ్ళిన వారొక ఏనుగు తలను తీసుకువచ్చారు.దానిని బాలుని మొండెముకు అతికించగా శివ తేజంతో ఆ బాలుడు పునః జీవితుడు అయ్యాడు. అల్ప సంతోషి అయిన పార్వతి తన బిడ్డను పునఃజివితుడైనoదుకు సంతోషించింది.ప్రపంచానికి గండం గడిచింది
అనంతరం దేవతలందరూ కలిసి గొప్ప ఉత్సవం చేసారు. సర్వగణదిపతిగా పట్టాభిషేఖం చేశారు. పార్వతి ఆనందించింది.అనేక విధాలైన సిద్ధులను అనుగ్రహించింది. `సింధుర వర్ణంతో నీవు అలరారుతున్నావు గనుక నీవు సిందూరంతో పూజింపబడతావు.దేవతలు అందరిలోను నికే అగ్ర పూజ దక్కుతుంది.గంధం,పువ్వులు,పండ్లు,వండిన ఆహార పదార్ధాలు,తాoభులం,హారతి,ప్రదక్షణ నమస్కారాలతో నిన్ను పూజించిన వారికీ సర్వ విఘ్నములు తొలగిపోయి,సర్వ సిద్ధులు కలుగుతాయి.అని పార్వతి ఆ గజానునికి వరములు ఇచ్చింది
శివుడు గణాధిపతిని తన బిడ్డగా ప్రకటించాడు.విగ్నేశ్వరుడు అర్హులైన వారందరిని గౌరవించి పూజించాడు. విష్ణువు మొదలగు దేవ ప్రముఖులు అందరు అతనిని దీవించారు. `మా వలెనే నీవు కుడా సర్వత్ర పుజనియుడవు అగుడువుగాక!ఎవరైతే నిన్ను పుజించకుండా మమల్ల్ని పూజిస్తారో వారి పూజ నిరాద్దకరము అవుతుంది.ముందుగా నిన్ను పూజించిన వారికీ సర్వ విఘ్నములు తొలగిపోవును గాగ అని అనుగ్రహించాడు
ఈశ్వరుడు వినాయకుని అశ్విరాధించి` భాద్రపదశుక్లచతుర్ధినాడు నీవు ఉదయించి నావు కావున అది నీ జన్మదినముగా విరాజిల్లుతుంది.సంవత్సరనికోకనాడు `భాద్రపద శుద్ద చతుర్ధి నాడు నిన్ను ఆరాధించినవారికీ ఆ సంవత్సరం అంత నిర్విఘ్నప్రదమవుతుంది.నీ పూజను ఒక వ్రతముగా గ్రహించి ప్రతి మాసములోను వచ్చు శుద్ధ చతుర్ధినాడు నిన్ను పూజిస్తే 12 వ సారి(12 వ నెలలో చవితి నాడు) ఉద్యపన చేసుకొన్నా వారికీ ఇహపర లోకాలలో తిరుగులేని సౌఖ్యాలు కలుగుతాయి. అని అనుగ్రహించాడు
గజముఖుడు,షణ్ముఖుడు శివకుమారులుగా,గణాదిపతులుగా అందరి పూజలనందుకొంటున్నారు
No comments:
Post a Comment