కాణిపాకం ఇతర దర్శింప దగిన ప్రదేశాలు


                   కాణిపాకం  దర్శింప దగిన  ఇతర  ప్రదేశాలు

  కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి.వరసిద్ది వినాయకుని ఎదురుగా ఓక మంచి నీటి కోనేరు ,ఒక విన్నూతమైన మండపం ఉన్నాయి


1.శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి వాయివ్వ దిశలో మరకతంభికా సమేత శ్రీ మణికంటేశ్వర ఆలయం వుంది. షణ్ముఖ,దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడు ఒక సర్పం (నాగుపాము) తిరుగుతూ వుంటుంది. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు.అది దేవత సర్పమని,ఎంతో గొప్ప మహిమ గలదని ,ఆ పాము పడగఫై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు ,భక్తులు చెప్పుతూ ఉంటారు

2.శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం వుంది.పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంను కట్టించమని అజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు.

3. కాణిపాకంలో ప్రసిద్దమైన ఆంజనేయస్వామి గుడి కుడా వుంది

4.వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాలమండపం, అద్దాల మేడ కుడా వుంది. ఈ ఊరు మూడవవంతు(3/4 వంతు) వివిధ దేవాలయములతో నిండి వుంది.అందుకే ఎందరో దేవతల విహరించిన విహరపురి ఇది అని అన్నారేమో

No comments:

Post a Comment