విగ్రహ ప్రతిష్టలో రకములు


                                  దేవతామూర్తుల(విగ్రహ) ప్రతిష్టలో రకములు

1)  స్వయంభు   2)దేవ ప్రతిష్టతములు  3) మానవ ప్రతిష్టములు


1.) స్వయంభూమూర్తులు :  మానవ కల్యాణమునకై,జనుల ఉద్దరించుటకై ఆయా దేవతలు తమంతట తామే స్వయంభువులుగా భూమిఫై అవతరించి,అందరి పూజలను అందుకొంటు ఉంటారు.అందుచేత వీటిని స్వయంభుదేవతా మూర్తిలు అంటారు. ఉదా: కాణిపాకంలోని శ్రీ వర సిద్ధి వినాయక మూర్తి అట్టిది

2. దేవతా ప్రతిష్టతములు: ఇంద్రాద్రి దేవతలు తమలో పుజనియులైన విష్ణువు,శివుడు మొదలగు వారు మూర్తులను భుమిఫై కొన్ని పవిత్ర స్టలములలో ప్రతిష్టించి పూజిస్తూ ఉంటారు. తర్వాత ప్రజలు వాటిని పూజిస్తూ ఉంటారు.  అట్టి దేవతా మూర్తులను దేవతా ప్రతిష్టతములoటారు

  ఉదా: ఎల్లోరా ప్రాంతంలో విష్ణువుచే ప్రతిష్టించబడిన ఘృస్టేశ్వర లింగం,రామేశ్వరంన శ్రీరామునిచే ప్రతిష్టించబడిన రామేశ్వర లింగం


3. మానవ ప్రతిష్టితములు: విష్ణువు,శివుడు శక్తి మొదలగు దేవతా మూర్తులను పూజించి,సిద్ది పొందుటకుగాను, మానవులు ప్రతిస్థించిపూజిస్తారు. అట్టివాటిని మానవ ప్రతిష్టతములు అంటారు.ఈనాడు మన దేశములో నున్న చాలా దేవ మందిరాలు మానవ ప్రతిస్థత దేవతామూర్తి మందిరములే అనవచ్చు.ఇక చిత్తూర్ జిల్లాలోని కాణిపాకం అనే గ్రామoలో లోక కళ్యాణంకై ,స్వయంభువుగా వెలసిన మూర్తి  శ్రీ వర సిద్ధి వినాయకుడుగా పూజలు అందుకొంటున్నాడు




No comments:

Post a Comment