http://kanipakamtemple.blogspot.in
చిత్తూరు జిల్లాలో ఎందరో దేవుళ్ళు దేవతలు వెలసియున్నారు.ప్రస్తుతము `కాణిపాకంగా పిలువబడుతున్న గ్రామము పూర్వము విహారపురి అని పిలువబడేది.ఈ గ్రామము,పరిసర ప్రదేశములు,దివ్యభవములతోను,ప్రకృతిరమణీయకతతోను వింత వింత అందాలతో కళ కళలాడుతూ దేవతలను సైతం తన్మయులై చేసివి.అందుకే దేవతల పురి(గ్రామములో) లో విహరిస్తూ వుండేవారు.కాబట్టి దానికి విహరపురి
అని పేరు వచ్చింది.ఇప్పటికి ఈ ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి. ఈ విహార పురికి ప్రక్కగా ఒక నది ప్రవహిస్తుంది
పూర్వం ఒకప్పుడు శంఖుడు,లిఖితుడు అను అన్నదమ్ములు ఇక్కడ స్వయంభువుగా వెలసియున్న శ్రీ వరసిద్ది వినాయకుడుని మహిమలను విని ,ఆ స్వామిని చూచుటకు ఎంతో దూరంనుండి కాలి నడకన బయలుదేరారు.చాలా దూరం నుండి వస్తూండడంచేత తాము తెచ్చుకొన్న ఆహారం అయిపోయింది.అన్నదమ్ములు ఇద్దరుఅలసిపోయారు. వారికీ ఆకలి బాగా ఎక్కువ బాధిస్తుంది.అయిన వారు పట్టుదలగా నడుస్తూనే వున్నారు.విరు నడచి వచ్చు దారిలో వారికీ ఒక మామిడి పండ్ల తోట కనిపించింది..చెట్ల నిండా కాయలు ఆరముగ్గి వేలాడుతున్నాయి.తమ్ముడైన లిఖితుడు చిన్న వయస్సుకావడం చేతఆకలికి తట్టు కోలేకపోతున్నాడు.చెట్టు నుండి ఒక పండును కోసుకొని తింటానని అన్నయైన శంఖుని అడిగాడు.అ తోటకు సంబందించిన వ్యక్తులు ఎవ్వరు ఆ ప్రాంతంలో వారికీ కనిపించలేదు.యజమానిని అడగకుండా ఏ వస్తువును తీసుకొన్న అది దొంగతనము అవుతుందని,కావున మామిడి పండును కోయరాదని ఇక చేరవలసిన కాణిపాక ప్రదేశము(విహార పురి) దగ్గరలోనే వుందని తమ్మునికి నచ్చ చెప్పాడు.తమ్ముడైన లికితుడు ఆకలికి తట్టుకోలేక పోతున్నాడు.అన్న మాటలను పెడ చెవిన పెట్టి తమ్ముడు మామిడి చెట్టు నుండి ఒక పండును కోసుకొని తిన్నాడు
తను చెప్పుతున్న వినిపించుకోక ధర్మ విరుద్దంగా ప్రవర్తించిన తమ్ముడిని శంఖుడు తిన్నగా అ ఊరి రాజు వద్దకు తీసుకువెళ్లి తన తమ్ముడు ఎవరిదో అయిన తోటలోని మామిడి చెట్టు నుండి వారి అనుమతి లేకుండా ఒక పండును కోసుకొని తిన్నాడని,అది దొంగతనము అని పించుకొంటుందని,కావున తన తమ్ముడిని శిక్షించే రాజుతో ఫిర్యాదు చేస్తాడు.రాజు లిఖితుని రెండుచేతులను నరికి వేయమని భటులను ఆజ్ఞ పిస్తాడు.రాజ భటులు లిఖితుని రెండు చేతులను నరికి వేస్తారు.చిన్న తప్పు చేసిన తన తమ్ముడికి రాజు ఇంత ఘోరమైన శిక్షా వేస్తాడని శంఖుడు అనుకోలేదు.ఎంతో భాదపడ్డాడు.అయినా ఇక చేయగలిగేది ఏమిలేదు అని అక్కడ నుండి ఆ అన్నదమ్ములు ఇద్దరు శ్రీ వర సిద్ది వినాయకుని తలుచుకొంటూ ఆ స్వామిని దర్శించడానికి బయలు దేరారు. వెళ్ళునది దైవ దర్శనముకు అందుచే శంఖు,లిఖితులు స్వామివారికీ ప్రక్కన ప్రవహించు నదిలో స్నానం చేసి దేవుని దర్శించాలని అ నదిలోకి అన్నదమ్ములు ఇద్దరు దిగారునదిలో వారుస్నానముకు మునిగినంతనే లిఖితునకు నరుక బడిన చేతులు పూర్వంలాగే వచ్చేశాయి. వారి ఆనందానికి అవధులు లేవు. నదిలో మునిగినంతనే పోయిన రెండు చేతులు తిరిగి వచ్చినవి కనుక ఆనాటి నుండి ఆ నదికి `భాహుదా` అనే పేరు స్తిరపడిపోయింది. నాటినుండి ఆ అన్నదమ్ములు ఇద్దరు వినాయక స్వామి వారి మహత్యంను కీర్తిస్తూ ప్రచారం చేస్తూ జీవించారు
అట్లు కొంతకాలం జరిగాక బహుదా నది వరదలు మొదలగు ప్రకృతి విలయ తాండవం వల్ల స్వామి వారి విగ్రహం భూమిలో నిక్షిప్తం అయింది. ఆనాడు దానిని ఉద్దరించే వారు లేకపోవడం చేత వినాయక స్వామి చాలా కాలం భూమిలో మరుగున పడి పోయాడు. కాలక్రమంలో అ ప్రాంతం తిరిగి సస్యశామలం అయి పండ్ల తోటలతోను, పచ్చని ఫైరు పంటలతోను శోభాయమానంగా తయారు అయిoది.
పుట్టుకతోనే ఒకరు గ్రుడ్డి, ఒకరు చెవిటి, ఒకరు మూగ అయిన ముగ్గురు వ్యక్తులు ఆ గ్రామమునకు ఎక్కడినుండో వచ్చి స్తిరపడ్డారు. వారు ముగ్గురు ఒకరికొకరు సాయం చేసుకొంటూ కలిసి జీవించేవారు.వారు ఆ గ్రామంలో కొంత భూమిని సేకరించికొని అందులో ఒక నుయ్యిని త్రవ్వుకొని ఆ నీటితో మిగిలిన భూమిలో వ్యవసాయం చేసుకొంటూ వుండేవారు.అలా కొంతకాలం జరిగాక విహార పురిలో కరువు ఏర్పడింది. వానలు లేకనేల భిటలువారింది. రైతులు,ప్రజలు పంటలకే కాదు. త్రాగు నీటికి కూడా చాలా భాదపడవలసి వచ్చింది.బహుదా నది ఎండి పోయిoది.అంటూ రోగాలు ప్రబలాయి.ప్రజలు ఆకులూ, అలములు తిని బ్రతకవలసిన పరిస్టితి ఏర్పడింది. ఇక అ వికలాంగుల పరిస్టితి మరి దయనీయంగా మారింది
ఒకనాడు అ ముగ్గురు వికలాంగులు తమ పొలంలోని నూతిని మరికొంచెము లోతు చేయడం మంచిదని తలచి అందుకు నడుం కట్టారు. వారు ముగ్గురు బావిని త్రవ్వగా త్రవ్వగా కొంత తడి తగిలింది.నీరు కొద్ది కొద్దిగా ఉరుతోంది. బావిలో నుండి నీటిని ఫైకి తీయడానికి ఒక కుండకు తాడు కట్టి కుండను వదిలారు.అది పగిలి పోయిoది.మళ్ళి మరొక కుండను వదిలారు.అది కుడా పగిలిపొయింది.అలా చాలా కుండలు పగిలిపోవడంతో బావిలోపల ఏదో ఒక రాయి ఉన్నట్లు ఉంది దానిని తొలగిస్తే ఇట్ల కుండలు పగిలి పోకుండా వుండటమే కాక మరికొంత నీరు ఉరుతోందని బావించి రాతిని పెకలించేందుకు చెవిటి,మూగ వారిద్దరూ బావిలోకి దిగారు. అట్లుఅడ్డు పడిన రాతిని పగులకొట్టి పూర్తిగా పెల్లగించాలనికొని వారు గునపంతో పదే పదే పోడవ సాగారు. త్రవ్వు తున్నఆ ప్రదేశంలో గునపం పడిన చోటు నుండి ఖంగు మనే శబ్దం వచ్చింది.
అట్లు వారు మూడు సార్లు ప్రయత్న్నం చేయగామూడు సార్లు ఈ విధంగా శబ్దం వచ్చి చివరి దెబ్బతో చిన్న రాతి ముక్క లాంటి భాగం విరిగి అవతల పడింది. అంతే అ ముక్క పగిలిన చోటు నుండి రక్తం యగ చిమ్మింది. అట్ల రక్తం యగ జిమ్మడానికి కారణం అక్కడున్న స్వయంభు వినాయకుని తల వెనుక భాగం చిట్లి ముక్క ఎగిరి పడడమే,ఆ రక్తం ఏక ధారగా కారుతూనే వుంది.ఎంతకు ఆగటం లేదు.
ఆ రక్తం అలా యాగజిమ్మడంతో ఒడ్డున వున్న గ్రుడ్డివాడు,బావిలోపల ఉన్న మూగవాడు,చెవిటివాడు కుడా ఆ రక్తంతో తడిసారు.అట్లు వారు రక్తంతో తడియగానే మూగ వాడికి మాటలు గ్రుడ్డివాడికి ద్రుష్టి,చెవిటివానికి శ్రావణ శక్తి లబించాయి.ఆ ప్రభావంతో ముగ్గురి అంగవైకల్య్యం తొలగిపోవడంతో అది దైవకృపయే అనిఆనందంతో భక్తిపరవశులైవారు.ఆ దైవమూర్తి నుండి వెలువడే రక్త ప్రవాహంఆగకపోవడంతో దానిని వారించడానికి వారు చేయు ప్రయత్నములు ఫలించక పోవడంతోచూపు వచ్చిన గ్రుడ్డి వాడు విహారపురి రాజు వద్దకు పరుగున పోయి జరిగిదిఅంత పూస గ్రుచ్చి నట్లు రాజుకు వివరించాడు. ఈ విషయంను విన్న రాజులో ఆనందం,భయాందోళనలు కలిగి మనసు వికలం అయిoది
ఆ సంఘటన జరిగిన ముందు రాత్రి రాజుకు వినాయక స్వామి విగ్రహం కలలో కన్పించడం,ఇపుడు నిజంగా ఇలా దర్శనం ఇవ్వడం రాజుకు ఆశ్చర్యం,ఆనందం కలిగింది. స్వామి తల నుండి వచ్చు చున్న రక్త ప్రవాహం ఆగటం లేదని తెలిసి కొనిన విహారపురి రాజు తన అంతః పురకాంతలతోను,సమస్త దండనాయకులతో,దాసదాసి పరివారముతోబయలు దేరి వర సిద్ది వినాయకుడు ఆవిర్భవించిన స్టలానికి చేరుకొన్నారు. విషయం తెలిసిన ప్రజలు గుంపులు గుంపులుగా రాజు వెంట అక్కడకు చేరుకొన్నారు.బావి దగ్గరకు చేరిన ఆ ప్రజా సముహంలోని భక్తి భావానికి అవధులు లేవు.కొబ్బరికాయలు,పత్ర పుష్పములు,కర్పూరాది పూజ ద్రవ్యములతో అపరమిత భక్తితో ఆ వినాయకస్వామిని పూజిస్తూ పలు విధాలుగా కీర్తించారు.శ్రోత్రనామాలు గానం చేసారు.భజనలు,అర్చనలు,నైవేద్యములు,సాష్టాంగ దండ ప్రణామాలతో తమ తప్పు మన్నించి స్వస్థరూపమున పొందుమని ప్రాద్దించారు. అయినా రక్తధార ఆగటం లేదు.స్వామికి కొబ్బరి ఇష్టమని కొబ్బిరి కాయలు కొట్టి ఆ నీటితో స్వామిని అభిషేకించారు. ఆ భక్తులు సమర్పించిన స్వచ్చమైన కొబ్బరినీరు బావి నుండి పొంగి పొరలి బావి చుట్టూ గల ఆ కాణి భూమిలో పారింది.అంతకుముందు అంగ వికులులుగా నున్న ఆ ముగ్గరుకు చెందిన భూమి (కాణి మాగాణి =1.3 ఎకరాలు) అంతట కొబ్బరి నీరు పారడం చేత ఆ ప్రాంతానికి కాణిపారకం అని పేరు వచ్చింది.అదే మాట కాలక్రమంలో `కాణిపాకం` గా మారి స్టిర పడింది.(తమిళ సంప్రదాయంలో గ్రామాల పెర్ర్లు చివర పాకం,బాకం వంటి పదాలు ఉండడం తెలిసిందే కదా)
ఈ విధంగా చిత్తూర్ జిల్లాలోని విహార పురి(ప్రస్తుత కాణిపాకం)లో శ్రీ వర సిద్ది వినాయకుడు స్వయంభువుగా తిరిగి ప్రకటింపబడ్డాడు.ఆనాటి నుండి వివిధ రాజుల ప్రజల సేవలతో ఆ క్షేత్రం అభివృద్ధి చెందింది