స్వామి వారి మహాత్య విశేషాలు


                                                స్వామి వారి మహాత్య విశేషాలు


కాణిపాకం ప్రమాణాలకు పవిత్రక్షేత్రంగా ప్రసిద్ది , ఎటువంటి వివాదమైన పొలిసు స్టేషన్,న్యాయ స్థానాలు,మధ్య వర్తుల అవసరం లేకుండానే ఉభయ పక్షాలవారు స్వామి పుష్కరణిలో స్నానమాచరించి స్వామి ముందు ప్రమాణం చేస్తే చాలు.ఆ వివాదం పరిష్కారం అవుతుంది. అపరాధిగా బావింపబడే వ్యక్తిని విడిచి పెట్టడం ఇక్కడ అనుసరించే పద్దతి, ప్రమాణం నిజం అయితే అతనికి ఎట్టి కీడును జరగదు. అబద్ధం పలికితే అతడు శిక్ష అనుబవించ బడుతాడు. స్వామి అపరాదుల్ని శిక్షించిన సందర్బాలు చాలా ఉన్నాయని ఇక్కడి ప్రజలు చెప్పుతారు

                సంతానం లేని దంపతులు,దీర్గరోగులు ఈ దివ్య క్షేత్రంను దర్శించి 11 లేక 22 లేక 41 రోజులు నియమంగా స్వామిని పూజిస్తే వారికీ సంతాన ప్రాప్తి కలగటం,ఆరోగ్యం చేకూరడం జరుగుతుంది. ఈ విధంగా స్వామి వారి అద్భుత మహిమలు ఎన్నో ప్రతక్ష ప్రమాణాలతో నిరూపించ బడ్డాయి

         సుమారు  50 సంవత్సరాల క్రితం అరగొండ గొల్లపల్లె వాస్తవ్వులు శ్రీ బెజవాడ సిద్దయ్య నాయుడు,శ్రీమతి లక్షమ్మ అను దంపతులు స్వామి వారికీ చేయిoచిన వెండి కవచం ఇప్పుడు స్వామి వారికీ పట్టడం లేదు. దీనిని బట్టి వినాయక స్వామి క్రమంగా అభివృద్ధి చెందుతున్నాడని ఇది ఒక ఉదాహరణ.శ్రీ స్వామి వారి తల వెనుక ఆనాటి గునపపు దెబ్బను నేటికి మనం గుర్తించవచ్చు.స్వామి వారు అవిర్బవించిన ఆ బావిలోనే నీటిని నేటికి భక్తులు తీర్ధంగా గ్రహిస్తున్నారు


           
శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి వాయువ్వదిశలో మరకతంబా సమేతుడైన శ్రీ మణికంఠెశ్వరులవారి ఆలయం వుంది.ఆలయ సింహ ద్వారం వద్ద గల రాజ రాజ నరేంద్ర చోళుని విగ్రహంను బట్టి ఇది అతని కాలంలో అంటే క్రి.శ 11 వ శతాబ్దంలో కట్టబడిందని చెప్పవచ్చు.తర్వాత కాలంలో విజయ నగర రాజులూ ఈ ఆలయాలను పునః నిర్మించారు.ఈ ఆలయంకు ముస్లింల తాకిడి అంతగా కనపడదు.ఆంధ్రులే కాక తమిళులు మొదలగు దక్షిణ భారత దేశ ప్రజలు వివిధ సేవలను అందిస్తూ ఆలయ అభిరుద్దికి కృషి చేస్తున్నారు


             

No comments:

Post a Comment